![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -649 లో......జ్యోత్స్న వెళ్తుంటే వైరా కార్ అడ్డు పెడతాడు. జ్యోత్స్న సడెన్ గా కార్ ఆపుతుంది. వెంటనే తన కార్ ఎక్కుతాడు. ఎందుకు వచ్చావని జ్యోత్స్న కోప్పడుతుంది. నిన్ను కిడ్నాప్ చేసామని వైరా అంటాడు. వెంటనే జ్యోత్స్న గన్ అతని తలపై పెడుతుంది. ఆ గన్ వైరా లాక్కొని జ్యోత్స్న తలకి పెట్టి తను చెప్పిన చోటు వెళ్ళమని చెప్తాడు.
ఆ తర్వాత జ్యోత్స్నని వైరా తాళ్లతో కట్టి బందిస్తాడు. దశరథ్ కకి ఫోన్ చేసి వాయిస్ మర్చి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు వైరా. నా కూతురు ఇంట్లో నే ఉందని దశరథ్ అంటాడు. దాంతో జ్యోత్స్నని వీడియో తీసి దశరథ్ కి పంపిస్తాడు వైరా. అది చూసి దశరథ్ షాక్ అవుతాడు. నిన్ను వదిలిపెట్టనని వైరాతో దశరథ్ అంటాడు నేనే దొరికిపోతానన్నప్పుడు నీ కూతురిని ఎందుకు బ్రతకనిస్తానని వైరా అంటాడు. ఆ తర్వాత ఈ ఇంటికి ఆస్తులు వారసురాలు జ్యోత్స్న.. తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని శివన్నారాయణ అంటాడు. ఈ విషయం సుమిత్రకి ఎలా చెప్పాలని దశరథ్ అనగానే అప్పుడే ఏ విషయమని సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది.
అత్త నువ్వు కూర్చోమని చెప్తాడు కార్తీక్. ఆ తర్వాత జ్యోత్స్నని కిడ్నాప్ చేసిన వీడియోని సుమిత్రకి కార్తీక్ చూపిస్తాడు. ఈ వీడియో ఎందుకు చూపించానంటే జ్యోత్స్న క్షేమంగా ఉందని మీకు చెప్పడానికి అని కార్తీక్ అంటాడు. మనం అంటే గిట్టని వారు ఎవరో జ్యోత్స్నని కిడ్నాప్ చేసారని కార్తీక్ చెప్పగానే సుమిత్ర షాక్ అవుతుంది.. అప్పుడే దశరథ్ కి వైరా వీడియో కాల్ చేసి జ్యోత్స్నని చూపిస్తాడు. జ్యోత్స్నని చూసి సుమిత్ర ఏడుస్తుంది. ఆ తర్వాత వైరా, జ్యోత్స్న చేతులు కలిపి ఎక్కువ డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |